- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శేరిలాలో వృద్ధురాలు అదృశ్యం
వెల్దుర్తి మండల పరిధిలోని శేరిలా గ్రామంలో ఓ వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

దిశ, వెల్దుర్తి : వెల్దుర్తి మండల పరిధిలోని శేరిలా గ్రామంలో ఓ వృద్ధురాలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన చినింగి వెంకమ్మ (80) శనివారం రాత్రి తన ఇంటి ఆరుబయట పక్కింటి కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆమె తన నివాసంలో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన సమయంలో వెంకమ్మ ఒంటి పై సుమారు రూ.1 లక్ష విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆమె ఎక్కడికైనా వెళ్లిందా? లేక ఎవరైనా అపహరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పై వెంకమ్మ కోడలు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఇటీవల గ్రామంలో వరుసగా చిత్రవిచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటుండటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.






