Bimbisara నుంచి 'ఈశ్వరుడే' లిరికల్ సాంగ్

by S Gopi |   (  Updated:2023-10-10 17:11:12  IST  )

Eeswarude Lyrical Song Out From Bimbisara| హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కొత్త కథాంశాలతో సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు హీరో క‌ళ్యాణ్‌ రామ్‌. ఒక వైపు హీరోగా రాణిస్తూనే పలు హిట్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇక ఆయన హీరోగా వశిష్ట్

Eeswarude Lyrical Song Out From Bimbisara
X

దిశ, సినిమా : Eeswarude Lyrical Song Out From Bimbisara| హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కొత్త కథాంశాలతో సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు హీరో క‌ళ్యాణ్‌ రామ్‌. ఒక వైపు హీరోగా రాణిస్తూనే పలు హిట్ చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇక ఆయన హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బింబిసార' మూవీ ఆగస్టు 5న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్​లుక్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది. కళ్యాణ్ రామ్ కూడా కళ్లకు కాటికతో చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి 'ఈశ్వరుడే' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ విడుదల చేశారు మేకర్స్. ఇక కేథరిన్, సంయుక్త మీనన్ ఫిమేల్ లీడ్ క్యారెక్టర్స్ పోషిస్తున్న చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం, కీరవాణి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో కఠిన శాసనాలు అమలుచేసే 'బార్బేరియన్ కింగ్ బింబిసారుడి'గా కనిపించనున్న కళ్యాణ్ రామ్.. తన కెరీర్‌లో ఎప్పుడూ చేయని విభిన్నమైన క్యారెక్టర్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

Next Story