- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ షాకిచ్చిన ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్.. అస్సలు ఊహించలేదంటూ నెటిజన్ల కామెంట్స్
టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), నటుడిగానూ పలు చిత్రాల్లో మెప్పించారు.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న తరుణ్ భాస్కర్(Tarun Bhaskar), నటుడిగానూ పలు చిత్రాల్లో మెప్పించారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయి హీరోగా మారి 'ఓం శాంతి శాంతి శాంతి' (Om Shanti Shanti Shanti)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈషా రెబ్బా(Eesha Rebba) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో, వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోంది. అయితే ఈ చిత్రాన్ని జనవరి 23న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే ప్రకటించింది.
తాజాగా హీరో తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా కలిసి ఓ వీడియో ద్వారా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడిస్తూ, కొత్త తేదీని ప్రకటించారు. దీంతో జనవరి 23న రావాల్సిన ఈ చిత్రం, ఇప్పుడు వారం రోజులు ఆలస్యంగా అంటే జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రేక్షకులు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు సడెన్‌గా వాయిదా వేయడానికి గల కారణాలెంటని అంతా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. మరోవైపు, గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, ఈ రూమర్లపై ఇటు తరుణ్ గానీ, అటు ఈషా గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ వ్యక్తిగత ప్రచారాల నడుమ, వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత నెలకొంది.
Read More..






