Rahasyam Idam Jagat: విజువల్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘ఈ జగమే విధిగా’ సాంగ్..

by sudharani |   ( Updated:2024-10-14 14:32:41.0  )
Rahasyam Idam Jagat: విజువల్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘ఈ జగమే విధిగా’ సాంగ్..
X

దిశ, సినిమా: రాకేష్‌ గలేబి (Rakesh Galebi), స్రవంతి పత్తిపాటి (Sravanti Pattipati), మానస వీణ (Manasa Veena), భార్గవ్‌ గోపీనాథం (Bhargav Gopinath) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రహస్యం ఇదం జగత్’ (Rahasyam Idam Jagat). సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న ఈ మూవీలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నట్లు ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమాను పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. ఇక మన పురాణాలు, ఇతిహాసాలు, శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి ‘రహస్యం ఇదం జగత్‌’ (Rahasyam Idam Jagat) నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ‘రహస్యం ఇదం జగత్’ నుంచి ‘ఈ జగమే విధిగా’ (Ee Jagame Vidhiga) అనే లిరికల్‌ సాంగ్ (song)ను విడుదల చేశారు మేకర్స్‌. చూడగానే ఆకట్టుకునే విజువల్స్‌తో, క్యాచీ లిరిక్స్‌, ట్యూన్‌తో అందర్ని ఈ పాట అలరిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ ఈ చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తప్పకుండా ఈ సినిమా అందరిని సర్‌ఫ్రైజ్‌ (surfries) చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed