ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ జనార్దన్ వాఘ్మారే కన్నుమూత!

by Malleboina Mahesh |

మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జనార్దన్ వాఘ్మారే (91) మహారాష్ట్రలోని లాతూర్ లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖుల సంతాపం.

ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ జనార్దన్ వాఘ్మారే కన్నుమూత!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ విద్యావేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ జనార్దన్ వాఘ్మారే (Dr. Janardhan Waghmare-91) కన్నుమూశారు. సోమవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్ నగరంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జనవరి 24న ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. డాక్టర్ జనార్దన్ వాఘ్మారే విద్యావేత్తగా, పార్లమెంటేరియన్‌గా సమాజానికి విశేష సేవలు అందించారు. ఆయన మృతి పట్ల విద్యా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story