వర్షానికి జలమయమైన విద్యాధికారి కార్యాలయం.. తడిసి ముద్దైన పాఠశాల పుస్తకాలు

by Jakkula.Mamatha |

టేకులపల్లి మండల విద్యాధికారి కార్యాలయంలో బుధవారం రాత్రి వచ్చిన వర్షానికి జలమయమై నీటిలో మునిగిపోయింది.

వర్షానికి జలమయమైన విద్యాధికారి కార్యాలయం.. తడిసి ముద్దైన పాఠశాల పుస్తకాలు
X

దిశ, టేకులపల్లి: టేకులపల్లి మండల విద్యాధికారి కార్యాలయం బుధవారం రాత్రి వచ్చిన వర్షానికి జలమయమై నీటిలో మునిగిపోయింది. మునిగిపోవడమే కాకుండా అందులో ఉన్నటువంటి పాఠశాల పుస్తకాలు, విద్యార్థుల నోటుబుక్కులు తడిసి ముద్దైన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై స్థానిక ఎంపీడీవోని ఫోన్ చేసి సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంఈఓని ఫోన్ చేయగా ఎంఈఓ కూడా స్పందించకపోవడం బాధాకరమైన విషయం. విద్యాధికారి కార్యాలయంలో పని చేస్తున్నటువంటి కార్యాలయ సిబ్బంది అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.

Next Story