- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడులు.. కలకత్తా హైకోర్టులో వాడివేడి వాదనలు
మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇటీవల కలకత్తాలోని ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా వెళ్లి ఈడి అధికారులను అడ్డుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఇటీవల కలకత్తాలోని ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా వెళ్లి ఈడి అధికారులను అడ్డుకుంది. ఈ పరిణామం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలో ఈడీ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించగా, తమ డేటా చోరీకి గురైందని టీఎంసీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా ఈ దాడులకు సంబందించి కలకత్తా హైకోర్టులో వాడివేడి వాదనలు నడిచాయి. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్ (I-PAC) కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిర్వహించిన సోదాలపై కలకత్తా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ దాడులకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఐ-ప్యాక్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సువ్రా ఘోష్ ధర్మాసనం విచారిస్తోంది.
ఈడీ కీలక వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. "మేము సోదాలు నిర్వహించింది ఒక చోట అయితే, సంబంధం లేని మరో పార్టీ (TMC) వచ్చి 'మా డేటా వారితో ఉంది' అని ఆందోళన చెందడం ఆశ్చర్యంగా ఉంది. చట్టపరంగా ఇలాంటి వాదనలకు తావులేదు," అని ఈడీ పేర్కొంది. తాము కేవలం అవినీతి కేసులో ఆధారాల కోసమే సోదాలు చేశామని, ఇందులో రాజకీయ జోక్యం లేదని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టులో స్పష్టం చేశారు.
TMC, ఐ-ప్యాక్ అభ్యంతరం..
మరోవైపు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించడానికి కేంద్రం ఈడీని వాడుకుంటోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఐ-ప్యాక్ వద్ద ఉన్న తమ పార్టీ అంతర్గత సర్వేలు, వ్యూహాలను ఈడీ సీజ్ చేయడం వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు. కాగా ప్రస్తుతం కలకత్తా హైకోర్టులో ఈ వ్యవహారంపై వాదనలు కొనసాగుతున్నాయి.






