- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లర్‌పై ఈడీ పంజా.. ఏకకాలంలో 11 చోట్ల సోదాలు
మాజీ డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లర్ నివాసాల్లో ఈడీ సోదాలు! పంజాబ్, చండీగఢ్‌లోని 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు. మనీలాండరింగ్ కోణంలో విచారణ ముమ్మరం.

దిశ, వెబ్ డెస్క్: మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద పంజాబ్ మాజీ డీఐజీ హర్చరణ్ సింగ్ (Former DIG Harcharan Singh) భుల్లర్ ఈడీ పంజా విసిరింది. ఆయన అనుచరులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లలో ఈ రోజు తెల్లవారుజామున ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చండీగఢ్ 02, లూధియానా 05, పాటియాలా 02, నాభా 01 జలంధర్: 1 ప్రాంతంలో ఈ సోదాను జరుగుతున్నాయి. చండీగఢ్‌లోని సిబిఐ (CBI) యూనిట్ గతంలో నమోదు చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. హర్చరణ్ సింగ్ భుల్లర్ ఒక క్రిమినల్ కేసును సెటిల్ చేయడానికి మధ్యవర్తి ద్వారా లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా, ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో సీబీఐ జరిపిన సోదాల్లో ఆయన నివాసాల నుండి సుమారు రూ. 7.36 కోట్ల నగదు, 1.5 కేజీల బంగారం, లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ సంపాదనను ఎక్కడ పెట్టుబడి పెట్టారు? బినామీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే కోణంలో ఈడీ ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించడమే ఈ సోదాల ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.






