రాబర్ట్ వాద్రా కేసులో ఈడీకి డెడ్‌లైన్.. ఫిబ్రవరి 26‌కి విచారణ వాయిదా

by Malleboina Mahesh |

ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ భక్త రాబర్ట్ వాద్రాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రాబర్ట్ వాద్రా కేసులో ఈడీకి డెడ్‌లైన్.. ఫిబ్రవరి 26‌కి విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ భక్త రాబర్ట్ వాద్రాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణను ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసింది. ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో ముడిపడి ఉన్న ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన అనుబంధ చార్జ్ షీట్‌పై వాదనలు వినిపించేందుకు కోర్టు ఈడీకి సమయం ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ జరిపిన ఈడీ, ఇటీవలే అదనపు ఆధారాలతో కూడిన చార్జ్ షీట్‌ను కోర్టుకు సమర్పించింది.

అయితే, ఈ విచారణ సందర్భంగా ఈడీ పనితీరుపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసులో ఇప్పటివరకు పరిగణనలోకి తీసుకోని పత్రాల (Unrelied Documents) జాబితాను దాఖలు చేయకపోవడంపై కోర్టు ఈడీని నిలదీసింది. దర్యాప్తు సంస్థలు నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే ఫిబ్రవరి 26వ తేదీలోపు పూర్తి స్థాయి పత్రాలను సమర్పించాలని కోర్టు ఈడీని ఆదేశిస్తూ, కేసును వాయిదా వేసింది.

Next Story