మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బెంగాల్ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్

by Malleboina Mahesh |

పశ్చిమ బెంగాల్‌లో కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఉన్న రాజ్యాంగపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. బెంగాల్ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) తన పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించడంతో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో బెంగాల్ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నూతన శాసనసభ (New Legislature) ఏర్పాటుకు భారత ఎన్నికల సంఘం బుధవారం (మే 6, 2026) అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారులు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ (Governor of Bengal)కు పంపారు. దీని ద్వారా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగిసినట్లయింది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఈ 'కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూ అసెంబ్లీ' నోటిఫికేషన్ అత్యంత కీలకమైన దశ.

ఈ నోటిఫికేషన్ జారీ తో కొత్త ఎమ్మెల్యేల జాబితా (List of new MLAs) గవర్నర్ వద్దకు చేరుతుంది. దీంతో శాసన సభలో మెజారిటీ సాధించిన పార్టీ, కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అధికారం గవర్నర్‌కు లభిస్తుంది. బీజేపీ ఇప్పటికే అమిత్ షా వంటి అగ్రనేతలను పర్యవేక్షకులుగా నియమించి, మే 9న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ పరిణామంతో బెంగాల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈసీ నిర్ణయంతో తన పదవికి రాజీనామా చేయనని పట్టుబట్టిన మమతా బెనర్జీకి ఊహించని షాక్ తగిలింది.

Next Story