హైదరాబాద్‌లో భూ ప్రకంపనల కలకలం.. గాజులరామారంలో జనం పరుగులు (వీడియో)

by Malleboina Mahesh |

మహానగరం హైదరాబాద్ లోని గాజులరామారంలో మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది.

హైదరాబాద్‌లో భూ ప్రకంపనల కలకలం.. గాజులరామారంలో జనం పరుగులు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: మహానగరం హైదరాబాద్ లోని గాజులరామారంలో మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. భాగ్యనగర శివారు ప్రాంతంలో ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడం (Earth shaking()తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా గాజులరామారం డివిజన్ (Gajularamaram Division) పరిధిలోని మెట్‌కాన్ కాలనీ (మెట్‌ఖాన్‌గూడ) ప్రాంతంలో ఉదయం 10:10 గంటల సమయంలో భారీ శబ్దం తో కూడిన ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కదిలిపోయాయని, దీంతో ఆందోళనకు గురైన గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌ల నివాసితులు ప్రాణ భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానిక విద్యా సంస్థలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రకంపణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియలో భూమి కంపించడం స్పష్టంగా కనిపించింది. కాగా ఆ వీడియోలోని భారీ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా, సమీపంలోని క్వారీలు, ఇతర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిందా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో జనం గందరగోళానికి గురవుతున్నారు. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని దీనికి గల కారణాలపై అధ్యయనం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.

Next Story