ఒడిశా అడవుల్లో అర్ధరాత్రి ఛేజింగ్.. రూ.2.50 కోట్ల గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్!

by Jakkula.Mamatha |

గంజాయి ముఠాల కదలికలపై సమాచారం అందుకున్న ఈగల్ టీం ఒడిశాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది.

ఒడిశా అడవుల్లో అర్ధరాత్రి ఛేజింగ్.. రూ.2.50 కోట్ల గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్!
X

దిశ, సిటీ క్రైమ్: గంజాయి ముఠాల కదలికలపై సమాచారం అందుకున్న ఈగల్ టీం ఒడిశాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. ఈగల్ తనిఖీని పసిగట్టిన గంజాయి ముఠా తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని ఈగల్ పోలీసులు భగ్నం చేసి 2.50 కోట్లు విలువ చేసే 500 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా బలిమెల నుంచి జైపూర్ మీదుగా గంజాయిని తెలంగాణలోకి తరలిస్తున్నారని ఈగల్ పెట్రోలింగ్ టీం కు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈగల్ టీం ఎస్ఐ రవిప్రసాద్ బృందం ఒడిశాలోని బలిమెల ప్రాంతానికి చేరుకున్నారు.

అర్ధరాత్రి అక్కడ తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ ఈగల్ పోలీసులను తప్పించుకుని అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈగల్ పోలీసులు కూడా దాదాపు అడువుల్లో 80 కిలోమీటర్ల వరకు ఛేజ్ చేశారు. చివరకు ఇక పోలీసులు వదలరని పసిగట్టిన బొలెరో డ్రైవర్ 500 కేజీల గంజాయితో పాటు వాహనాన్ని అక్కడ వదిలేసి పారిపోయాడు. వాహనాన్ని నెంబర్ ఆధారంగా యజమాని ఒడిశాకు చెందిన అమీర్ అలీ ఖాన్ గా గుర్తించారు. తదుపరి దర్యాప్తు కోసం గంజాయితో పాటు ఇతర వివరాలు ఈగల్ టీం ఒడిశా పోలీసులకు అందించారు. ఈగల్ టీం చేసిన ఛేజ్ కు ఒడిశా పోలీసు అధికారుల ప్రశంసలు కురిపించారు.

Next Story