- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు రోజుల్లో డ్వాక్రా సంఘాల రికార్డులు సమర్పించాలి
నర్సంపేట పట్టణంలోని 11, 12వ వార్డుల డ్వాక్రా సంఘాల్లో అవకతవకలు జరిగాయన్న మహిళా సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని 11, 12వ వార్డుల డ్వాక్రా సంఘాల్లో అవకతవకలు జరిగాయన్న మహిళా సంఘాల ఫిర్యాదుల నేపథ్యంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. శుక్రవారం వర్ధన్నపేట ఇన్‌చార్జి ఏడీఎంసీ శ్రీ వాణి ముగ్ధంపురంలో మహిళా సంఘ సభ్యులు, ఆర్పీలతో సమావేశమై సంఘాల నిర్వహణ, లావాదేవీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల పుస్తకాలు, రికార్డులు, సభ్యుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, 2020 నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని బుక్స్, రికార్డులను అత్యవసరంగా పూర్తి చేసి సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ప్రతి ఆర్పీ తన పరిధిలోని స్వయం సహాయక సంఘాల పుస్తకాలను నవీకరించి మూడు రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. కాగా, డ్వాక్రా సంఘాల్లో నగదు దుర్వినియోగం, లావాదేవీల్లో పారదర్శకత లేదంటూ మహిళా సంఘ సభ్యులు గత నెల 22న ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ సమావేశంలో టీఎల్‌ఎఫ్ ఆర్పీ మాధవి, మెప్మా అధికారులు, కౌన్సిలర్ చీకటి స్వరూప ఓదయ్య, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.






