కోల్‌కతా వీధుల్లో దువ్వాడ జంట సందడి.. వైరల్ అవుతున్న వీడియో!

by Kema Shiva Kumar |

తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలిచే వివాదాస్పద జంట, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి (Divvela Madhuri) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.

కోల్‌కతా వీధుల్లో దువ్వాడ జంట సందడి.. వైరల్ అవుతున్న వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో నిలిచే వివాదాస్పద జంట, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి (Divvela Madhuri) మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుత వీరిద్దరూ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో పర్యటిస్తున్నారు. అక్కడి వీధుల్లో సామాన్యుల తరహాలో రోడ్ల వెంట తిరుగుతున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. కోల్‌కతాలోని రద్దీగా ఉండే ఒక మార్కెట్ ప్రాంతంలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా షేర్ అవుతోంది. అందులో వీరిద్దరూ సాధారణ దుస్తుల్లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. చుట్టుపక్కల వారు గుర్తుపడతారనే ఎలాంటి సంకోచం లేకుండా, కోల్‌కతా వీధుల్లోని పాత కాలపు ట్రామ్ లైన్లు, చారిత్రక కట్టడాల మధ్య వారు విహరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story