- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాటాలాన్’ టీజర్ అప్డేట్ ఇచ్చిన దుషారా విజయన్.. పవర్ పోస్టర్ విడుదల
ఆంటోనీ వర్గీస్(Antony Varghese), దుషారా విజయన్(Dushara Vijayan) జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాటాలన్’ (Kattalan)ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది.

దిశ, సినిమా: ఆంటోనీ వర్గీస్(Antony Varghese), దుషారా విజయన్(Dushara Vijayan) జంటగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాటాలన్’ (Kattalan)ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. డెబ్యుట్ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సునీల్, కబీర్ దుహాన్ సింగ్, రాపర్ బేబీ జీన్, పార్థ్ తివిరి, జగదీష్, సిద్ధిక్, రాజ్ తిరందాసు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి బజ్ తెచ్చింది. శరవేగంగా షూటింగ్ కొనసాగుతుండగా, మేకర్స్ వరుస అప్డేట్స్‌తో హైప్ పెంచుతున్నారు. తాజాగా, టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. జనవరి 16న విడుదల కానున్న టీజర్ పోస్టర్‌లో ఆంటోనీ వర్గీస్ చనిపోయిన ఏనుగుపై నిలబడి, రక్తం కారుతున్న గొడ్డలిని పట్టుకుని హంటర్‌లా కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేశాడు. కాగా..ఈ మూవీ మే 14న థియేటర్స్‌లోకి రానుంది.






