Joe Biden: బైడెన్ సూట్ పైన పిట్ట రెట్టంట‌... గోలగోలంట నెట్టింట! (వీడియో)

by Disha Web Desk 20 |
Joe Biden: బైడెన్ సూట్ పైన పిట్ట రెట్టంట‌... గోలగోలంట నెట్టింట! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఈ మ‌ధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఊహించని విధంగా కామెడీకి కేరాఫ్‌గా మారుతున్నాడు. సోష‌ల్ మీడియాలో వినోదాలు పంచుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా, అయోవాలోని మెన్లోలోని బయోప్రాసెసింగ్ సెంటర్‌లో ప్రసంగిస్తున్నప్పుడు, డేగ క‌ళ్ల‌తో చూసిన నెటిజన్లకు ఏదో స్ప్లాష్ క‌నిపించింది. గ‌మ్మున ఉండ‌కుండా గోల‌గోల చేసేశారు. అది 'పిట్ట‌రెట్ట‌'లా ఉందే అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. బైడెన్ తన సూట్‌పై ధరించిన అమెరికన్ ఫ్లాగ్ లాపెల్ పిన్‌పై స్ప్లాష్ అయిన‌ప్ప‌టికీ కామెడీ ట్వీట్ల‌తో మొతెక్కిస్తున్నారు.

ఈ ప్ర‌సంగంలో బైడెన్ గ్యాస్ ధరలను గాలన్‌కు 10 సెంట్లు తగ్గించడం గురించి మాట్లాడుతుండ‌గా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం వివిధ దేశాల‌ను చుట్టుముట్టిన తీవ్ర ద్రవ్యోల్బణం గురించి ఈ ప్ర‌సంగంలో ప్రస్తావించారు. ఇంత సీరియ‌స్ సంద‌ర్భంలో ఈ స‌ర‌దా వీడియో వైరల్ కావడంతో, ప్రజలు భారీగా జోకులు పేల్చారు. కొందరు పిట్ట‌రెట్ట ప్రాధాన్యత గురించి ఫన్నీ జోక్‌లను పంచుకుంటే, మరికొందరు నవ్వుతూ ఎమోటికాన్‌లను జ‌త‌చేశారు. ఇక‌, డైలీ మెయిల్ ప్రకారం, ఈ స్ప్లాటర్ అమెరిక‌న్ ఫ్లాగ్ పిన్‌ అని వైట్ హౌస్ అధికారి స్పష్టం చేశారు.

ఇక‌, ఇటీవ‌ల, కమలా హారిస్‌ను అమెరికా ఫ‌స్ట్ లేడీ అని, మిచెల్ ఒబామాను వైస్‌ ప్రెసిడెంట్‌ అని జో బైడెన్‌ పొరపాటున సంబోధించగా, అది కాస్తా వైరల్‌గా మారిన విష‌యం తెలిసిందే.





Next Story

Most Viewed