మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేసిన లారీ డ్రైవర్

by Jakkula.Mamatha |

విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి కాలర్ పట్టుకుని నెట్టివేసిన ఓ లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

మద్యం మత్తులో కానిస్టేబుల్ పై దాడి చేసిన లారీ డ్రైవర్
X

దిశ, గుడిహత్నూర్: విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడి చేసి కాలర్ పట్టుకుని నెట్టివేసిన ఓ లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ విజయ్ కుమార్ జాతీయ రహదారిపై కంటైనర్ నిలపడంతో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ రెడ్డి ప్రభుత్వ ట్యాబ్‌తో కంటైనర్ ఫొటో తీయడానికి ప్రయత్నించారు. ఆది చూసిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో కానిస్టేబుల్‌తో గొడవకు దిగి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని వెనక్కి నెట్టేసి విధులకు ఆటంకం కలిగించాడు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ దిలీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని సాక్షుల సమక్షంలో డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా 63 ఎంజి శాతం ఆల్కహాల్ నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగి పై దాడి మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు నిందితుడిపై కేసు నమోదు చేసి బోథ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా మెజిస్ట్రేట్ అతనికి 14 రోజుల శిక్ష విధించడంతో రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.

Next Story