స‌ముద్రంలో మునిగిపోతున్న బాలుణ్ని కాపాడిని డ్రోన్ (వీడియో)

by Disha Web Desk 20 |
స‌ముద్రంలో మునిగిపోతున్న బాలుణ్ని కాపాడిని డ్రోన్ (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః డ్రోన్లు వ‌చ్చిన త‌ర్వాత మాన‌వాళికి చాలా విష‌యాలు సుల‌భ‌మ‌య్యాయి. ముఖ్యంగా, ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌తా కార్య‌క‌లాపాల్లో డ్రోన్లు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల‌, స్పెయిన్‌లోని వాలెన్సియాలో స‌ముద్రంలో మునిగిపోతున్న 14 ఏళ్ల బాలుడి ప్రాణాలను డ్రోన్ లైఫ్‌గార్డ్ రక్షించింది. బీచ్‌లో బ‌లంగా వ‌స్తున్న అలల్లో చిక్కుకుపోయి, బ‌య‌ట‌కి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బాలుడికి డ్రోన్ ద్వారా లైఫ్‌జాకెట్ అందించ‌గా, దాని సహాయంతో లైఫ్‌గార్డ్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే వరకు స‌ముద్రంలో బాలుడు తేలుతూ ఉన్నాడు.

వాలెన్సియాకు ఉత్తరాన ఉన్న సగుంటో అనే న‌గ‌రంలో స్పానిష్ లైఫ్‌గార్డ్ సిబ్బందితో క‌లిసి జనరల్ డ్రోన్స్ వాలెన్సియా ఆధారిత కంపెనీ ప‌నిచేయ‌డం ప్రారంభించిన త‌ర్వాత ఇప్పుడ‌ది స్పెయిన్ అంతటా 22 బీచ్‌లలో లైఫ్‌గార్డ్‌లతో కలిసి 30కి పైగా పైలట్‌లతో వారి డ్రోన్‌లను ఉంచింది. మునిగిపోతున్న వ్యక్తి ద‌గ్గ‌ర‌కి లైఫ్‌గార్డ్‌లు భౌతికంగా చేరుకోడానికి ముందు డ్రోన్ బృందాలు క్షణాల్లో స‌హాయాన్ని అందిస్తారు. "ఈ క్ష‌ణాలు కొన్ని సందర్భాల్లో చాలా కీల‌కమైన‌వి. రెస్క్యూ బృందాలు ఆప‌ద‌లో ఉన్న వ్యక్తిని మరింత ప్రశాంతంగా, జాగ్రత్తగా సంప్రదించడానికి కూడా ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి" అని డ్రోన్ పైలట్ మిగ్వెల్ ఏంజెల్ పెడ్రెరో ఈ సంద‌ర్భంగా రాయిట‌ర్స్‌తో అన్నారు. ఇక‌, రాయల్ స్పానిష్ లైఫ్‌సేవింగ్ అండ్ రెస్క్యూ ఫెడరేషన్ గణాంకాల ప్రకారం, స్పెయిన్‌లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 140 మంది ఇలాగే నీటిలో మునిగి మరణించిన‌ట్లు స్థానిక నివేదిక‌లు వెల్ల‌డించాయి. గతేడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 55 శాతం ఎక్కువని కూడా పేర్కొన్నాయి.


Next Story

Most Viewed