Big Breaking : CPR తో డ్రైవర్ శంకర్ గౌడ్ లో చలనం.. DRDO లో కొనసాగుతున్న చికిత్స

by Muthe.Rajitha |

RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంకా ప్రాణాలతో ఉన్నారని సమాచారం.

Big Breaking : CPR తో డ్రైవర్ శంకర్ గౌడ్ లో చలనం.. DRDO లో కొనసాగుతున్న చికిత్స
X

దిశ, వెబ్ డెస్క్ : RTC డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంకా ప్రాణాలతో ఉన్నారని సమాచారం. ఆర్టీసీ సమ్మెలో సందర్భంగా డ్రైవర్ శంకర్ ఆత్మహత్య ప్రయత్నం చేసారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆయనను వరంగల్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో తొలుత మరణించగా.. చాలా సమయం CPR అనంతరం శంకర్ గౌడ్ లో చలనం వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను కంచన్ బాగ్ DRDO అపోలో ఆసుపత్రిలో తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అపోలో ఆసుపత్రికి చేరుకొని శంకర్ గౌడ్ కు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

అలాగే ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, దైర్యం చెప్పారు. శంకర్ గౌడ్ కు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులు భావోద్వేగంలో ఎలాంటి అఘాయిత్యానికి పాలపడవద్దని సూచించారు. నేడు సీనియర్ ఐఏఎస్ అధికారులతో యూనియన్ నాయకులు చర్చలు జరుపుతారని తెలిపారు. మరోవైపు కంచన్ బాగ్ DRDO ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.

Next Story