- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడుగంటిన పాలేరు జలాశయం
పాలేరు జలాశయం అడుగంటింది.గరిష్టనీటిమట్టం నీటిమట్టం 23 అడుగులకుగాను ప్రస్తుతం 13 అడుగులమేర నీరు నిల్వ ఉంది.

దిశ, కూసుమంచి : పాలేరు జలాశయం అడుగంటింది.గరిష్టనీటిమట్టం నీటిమట్టం 23 అడుగులకుగాను ప్రస్తుతం 13 అడుగులమేర నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం భగీరథ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు 100 క్యూసెక్కులు, సూర్యాపేట జిల్లాకు 100 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. కాగా జలాశయం నీటిమట్టం మరో రెండు అడుగులు తగ్గితే ప్రాజెక్టుకు నీరందక తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉంది. పాలేరు మినీహైడల్ పక్కన ఉన్న ప్రాజెక్టుకు, గుర్వాయిగూడెం వద్ద నిర్మితమై ఉన్న ప్రాజెక్టుకు నీరందడం కష్టమవుతుంది. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో సుమారు 73గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. పాలేరు జలాశయంలో నీటినిల్వలు తగ్గడంపై ఇప్పటికే ఐబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు భగీరథ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే సాగర్ డ్యామ్‌నుంచి నీటి విడుదలకు మొదటిజోన్ పరిధిలో ఆధునీకరణ పనులు జరుగుతుండటం వల్ల నీరు విడదల ఆలస్యం అవుతుందని తెలిపారు. మరో రెండు రోజుల్లో సాగర్ డ్యామ్‌నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం నీరువిడుదల చేయించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 15రోజులపాటు నీటినిల్వలు సరిపోతాయని తెలిపారు.






