- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సేవే శ్వాసగా జీవించిన డాక్టర్ రాజు
మండల పరిధిలోని పోలంపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ రాజు బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం మృతి చెందారు.

దిశ,కారేపల్లి : మండల పరిధిలోని పోలంపల్లి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ రాజు (38)బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం మృతి చెందారు.కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రెండు నెలల క్రితం ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స అనంతరం కోలుకుని ఇంటికి చేరుకున్నారు.అయితే వారం రోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముందుగా ఖమ్మంలోని ఆసుపత్రిలో చికిత్స అందించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.చికిత్స కోసం సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిరిగి ఖమ్మంలోని ప్రశాంతి ఆస్పత్రికి తీసుకువచ్చారు.అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సేవే శ్వాసగా జీవించిన డాక్టర్ రాజు..
గ్రామీణ ప్రజల ఆరోగ్యమే తన బాధ్యతగా భావించి, పేదల కష్టాల్లో అండగా నిలిచిన ఆర్‌ఎంపీ డాక్టర్ రాజు ఇక లేరనే వార్త పోలంపల్లి గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. అర్ధరాత్రి అయినా, వర్షం అయినా, ఎండైనా రోగి పిలిస్తే ముందుండే ఆయన సేవా తత్వం గ్రామస్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. డబ్బుకంటే మానవత్వానికే విలువ ఇచ్చిన రాజు మరణం వైద్య రంగానికే కాకుండా గ్రామీణ సమాజానికి తీరని లోటుగా మారింది. ఆయన చిరునవ్వు, సేవాభావం, ఆప్యాయతను గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.






