- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సృష్టి కేసులలో డాక్టర్ నమ్రత ఆస్తులు జప్తు
సృష్టి కేసులలో ఈడీ డాక్టర్ నమ్రత ఆస్తులు జప్తు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ పేరుతో ఆక్రమాలకు పాల్పడిన డాక్టర్ పాచిపల్లి నమ్రత అలియాస్ అథ్లూరి నమ్రతకు సబంధిచంచిన ఆస్తులను హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయ అధికారులు జప్తుచేసినట్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అక్రమ సరోగసీ రాకెట్ దర్యాప్తులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం రూ. 29.76 కోట్ల విలువైన 50 స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. సీజ్ చేయబడిన ఆస్తులు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుల పేరు మీద ఉన్నట్లు ఈడి అధికారులు పేర్కోన్నారు. భూమలు, ఫ్లాట్‌లు ఆసుపత్రి రూపంలో ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. ఈడి సీజ్ చేసిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం దాదాపు రూ. 50 కోట్లు ఉంటుందని పేర్కోన్నారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ లో అక్రమ అక్రమ సరోగసీ, పిల్లల అక్రమ రవాణా, ఇతర మోసాలకు సంబంధించి నమోదు అయిన పలు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా డాక్టర్ నమ్రత తన ఉద్యోగులు ఏజెంట్లతో కలిసి సరోగసీ రాకెట్ నిర్వహించి పిల్లలు లేని జంటలకు నవజాత శిశువులను విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కోన్నారు.
పిల్లలు లేని జంటలకు సరోగసి విధానం ద్వారా పిల్లను పొందవచ్చని వారి నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కోన్నారు. నవజాత శిశువును పెంచే ఆర్థిక స్థితి లేని పేదవారి నుంచి , గర్భస్రావం చేయాలనుకున్న వారి నుంచి శిశువులను సేకరిచించిన్నట్లు గుర్తించారు. శిశువులను విక్రయించిన వారికి ఆడ శిశువుకు దాదాపు రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షలు చెల్లించేవారని దర్యాప్తులో తేలింది. ఏజెంట్లు, సబ్-ఏజెంట్ల నెట్‌వర్క్ ఈ రాకెట్‌లో నడుపబడినట్లు గుర్తించారు. సికింద్రాబాద్ ఆసుపత్రి లైసెన్స్‌ను అధికారులు రద్దు చేయడంతో విశాఖపట్నంలోని మరో ఆసుపత్రిలో అలాంటి ప్రసవాలు జరిగినట్లుగా గుర్తించినట్లు తెలిపారు.
మున్సిపల్ అధికారులకు పంపిన జనన నివేదికలను ఆమె నకిలీ చేసి, పిల్లలు లేని జంటల పేర్లను వారి తల్లిదండ్రులకు బదులుగా తల్లిదండ్రులుగా చూపించినట్లు గుర్తించారు. 2014 నుంచి ఆమె ఈ రాకెట్‌లో నిర్వహిస్తుందని, అనేక కేసులు నమోదు తర్వాత ఆమె వైద్య లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె నకిలీ సరోగసీ రాకెట్‌ను కొనసాగించిందని ఈడి దర్యాప్తులో తేలింది. నమ్రతను ఫిబ్రవరి 12వ తేదిన అరెస్ట్ చేసినట్లు ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నట్లు ఈడి అధికారులు పేర్కోన్నారు.
- Tags
- ED
- srushti case






