- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదు సర్కిళ్లకు ఒక్కరే.. అధికారుల మౌనం పై అనుమానాలు
ఖైరతాబాద్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిశ, ఖైరతాబాద్: ఖైరతాబాద్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమీర్‌పేట్ సర్కిల్‌లో అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నా, ఫిర్యాదులు అందిన కూడా అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భవన నిర్మాణాలకు అవసరమైన అనుమతులు టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి తీసుకోవాల్సి ఉండగా, కొందరు నిర్మాణదారులు ఎలాంటి అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన అనుమతి రుసుములు కోల్పోయి ఖజానాకు నష్టం వాటిల్లుతుందని విమర్శలున్నాయి. జీహెచ్ఎంసీ భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవనానికి 63 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ అనుమతులు ఎలా వచ్చాయని ప్రశ్న లు వినిపిస్తున్నాయి. ఈ ట్రాన్స్ ఫార్మ ర్ ప్రజల రాకపోకల సమీపంలో ఉం డడంతో భద్రతపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సనత్ నగర్ జీహెచ్ఎంసీ మైదానం వద్ద అక్రమ నిర్మాణం..
అమీర్‌పేట్ సర్కిల్-39 పరిధిలోని సనత్ నగర్ జీహెచ్ఎంసీ మైదానం ఎదురు వీధిలో అనుమతులకు మించిన అక్రమ నిర్మాణం కొనసాగుతోంది. నిబంధనలు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎస్‌ఆర్ నగర్‌లో ఒకేచోట నాలుగు..
అమీర్‌పేట్ సర్కిల్-39 పరిధిలోని ఎస్‌ఆర్‌నగర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక వీధిలో ఒకే ప్రాంతంలో నాలుగు భవనాల నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ సెల్లార్లతో పాటు అనుమతులకు మించి ఐదు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు బహిరంగంగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పనిభారం పేరుతో సాకులు..
భవన నిర్మాణాలు చేపట్టే ముందు టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాల్సి ఉంటుంది. తమ పరిధిలో జరుగుతున్న ప్రతి నిర్మాణానికి సంబంధించిన పూ ర్తి సమాచారం సంబంధిత అధికారుల వద్ద ఉండాల్సి ఉండగా, మీర్‌పేట్–ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో మాత్రం అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒకే ప్రాంతంలో నాలుగు భవనాలు అక్రమ సెల్లార్లతో పాటు అనుమతులకు మించి అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులకు ఈ విషయం పై సమాచారం లేదని, తమ దృష్టికి రాలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులే పనిభారం పేరుతో బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.
ఐదు సర్కిళ్ల బాధ్యతలు ఒక్క ఏసీపీకే..
ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ఐదు టౌన్ ప్లానింగ్ సర్కిళ్లకు ఒక్కరే ఇన్‌చార్జి ఏసీపీగా రమేశ్ విధులు నిర్వహిస్తున్నారు. జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై స్పందించిన ఆ యన, ఐదు సర్కిళ్లకు సంబంధించిన పరిపాలన వ్యవహారాలు, కోర్టు కేసులు, ఇతర అధికారిక బాధ్యతలన్నీ ఒకేసారి నిర్వహించాల్సి రావడంతో ప్రతి నిర్మాణాన్ని పర్యవేక్షించడం ఆలస్యం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతా విధుల్లో నిమగ్నమై ఉన్నారని, దీంతో ఫీల్డ్ స్థాయిలో తనిఖీలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలపై తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తామని ఏసీపీ హెచ్చరించారు.






