ఏపీలో పెరుగుతున్న కరోనా కేసలు.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. దేశంలో జూలై 1 నుండి 340కి పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఏపీలోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసలు.. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశంలో మ‌రోసారి క‌రోనా కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. దేశంలో జూలై 1 నుండి 340కి పైగా కరోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఏపీలోనూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గ‌డిచిన 20 రోజుల్లోనే రాష్ట్రంలో 13కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. క‌డ‌ప జిల్లాలో అత్య‌ధికంగా 8 కేసులు న‌మోదు కాగా, గుంటూరులో 3, విశాఖ‌లో 1, కాకినాడ‌లో 1 కేసు న‌మోదైంది. మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే రాష్ట్రంలో న‌లుగురు మృతి చెందారు. హోం ఐసోలేష‌న్ లో మ‌రో ముగ్గురు ఉన్నారు. ఆస్ప‌త్రిలో ఇద్ద‌రు కోవిడ్ పేషంట్స్ కు చికిత్స అందుతోంది.

కృష్ణా జిల్లాకు చెందిన మ‌రో మ‌హిళ సైతం క‌రోనా బారిన ప‌డ‌గా ఆమెకు ఎయిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సీ కోసం క‌రోనా బారినప‌డ్డ పేషెంట్ల శాంపిల్స్‌ను పూణేలోని ల్యాబ్‌కు పంపించారు. కేసులు ఎక్కువగా వస్తుండటంతో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులను అప్రమత్తం చేసింది. ముందులు, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కరోనా కేసులపై నేడు మధ్యాహ్నం తరవాత సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story