యూపీలో దారుణం.. కోట్ల ఆస్తి రాసిచ్చినా తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు

by Ajay Maddhiboyina |

యూపీలో దారుణం చోటు చేసుకుంది. కోట్ల ఆస్తి రాసిచ్చినా ఇంకా కావాలంటూ ఓ కొడుకు తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న యూపీలోని గాజియాబాద్ లోని మోదీన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

యూపీలో దారుణం.. కోట్ల ఆస్తి రాసిచ్చినా తండ్రిని తుపాకీతో కాల్చి చంపిన కొడుకు
X

దిశ‌, వెబ్ డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. కోట్ల ఆస్తి రాసిచ్చినా ఇంకా కావాలంటూ ఓ కొడుకు తండ్రిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న యూపీలోని గాజియాబాద్ లోని మోదీన‌గ‌ర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మోడీ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బుడానా గ్రామంలో హ‌రి ఓం ఛౌద‌రి అనే భూస్వామి రైతుకు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు నిఖిల్ కాగా చిన్న కుమారుడు నీషూ. వీరిలో పెద్దకుమారుడు నిఖిల్ మ‌ద్యానికిర బానిసై డ‌బ్బుల కోసం త‌ర‌చూ తండ్రిని వేధించ‌డం మొద‌లు పెట్టాడు.

తండ్రికి మొత్తం 47ఎక‌రాల భూమి, ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉండ‌గా వాటిలో ఇప్ప‌టికే 15 ఎక‌రాల భూమిని రాసిచ్చాడు. అయిన‌ప్ప‌టికీ మిగితా ఆస్తిని సైతం త‌న‌పేరిట రాయాల‌ని నిఖిల్ తండ్రిని వేధించ‌డం మొద‌లుపెట్టాడు. కానీ అందుకు తండ్రి నిరాక‌రించాడు. దీంతో కోపంతో ర‌గిలిపోయిన నిఖిల్ మ‌ద్యం మ‌త్తులో ఇంటికి వెళ్లాడు. అదే స‌మ‌యంలో తండ్రి మంద‌లించ‌డంతో ఆస్తి విష‌యంలో గొడ‌వ పెట్టుకుని తుపాకీతో కాల్చి హ‌త‌మార్చాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పొలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story