- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంకీల డ్రెస్‌లో మెరిసిపోతూ అందానికే అడ్రస్‌లా మారిన రాశి ఖన్నా
గ్లామర్ డోస్ పెంచిన రాశి ఖన్నా.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్‌లో 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో కథానాయికగా పరిచయమైన రాశి ఖన్నా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అనంతరం వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి చాలా కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించింది.
ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలపై ఎక్కువ దృష్టి సారించడంతో గత కొంతకాలంగా తెలుగులో ఆమె సినిమాలు తగ్గాయి. సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి ఖన్నా సోషల్ మీడియాలోనూ అదే జోష్‌ను కొనసాగిస్తోంది.
తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని స్టైలిష్ ఫొటోలను పంచుకుంది. చెంకీలు పొదిగిన అల్ట్రా స్టైలిష్ డ్రెస్‌లో విభిన్న కోణాల్లో ఫోజులిచ్చిన ఈ బ్యూటీ ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఆమె ధరించిన డ్రెస్ ఈ ఫొటోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Photos Courtesy: Instagram






