గోలేటిలో ఇంటింటి ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణ

by Batti.Sumithra |

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటి ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహించారు.

గోలేటిలో ఇంటింటి ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహణ
X

దిశ, రెబ్బెన : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటి ఎస్‌ఐఆర్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ఓటర్లకు పంపిణీ చేసిన ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌వోలకు తిరిగి అందజేయాలని సూచించారు. అలాగే 2002 మ్యాపింగ్‌కు సంబంధించిన డేటాను తప్పనిసరిగా బీఎల్‌వోలకు సమర్పించాలని తెలిపారు. ఎక్కువ మంది ఓటర్ల వివరాలు బీఎల్‌వోల వద్ద అందుబాటులో ఉంటాయని, వివరాలు లేని వారు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వెబ్‌సైట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, యూత్ కాంగ్రెస్ రెబ్బెన మండల అధ్యక్షుడు, గోలేటి వార్డు సభ్యుడు పూదరి సాయి, జీపీవో మహేందర్, పంచాయతీ కార్యదర్శి పోషం, బీఎల్‌వోలు సుశీల, భాగ్యలక్ష్మి, రుక్మిణి, పులవతి, కారోబార్ సుధాకర్, స్థానిక 10వ వార్డు సభ్యుడు బానోతు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story