maid: మీ ఇంట్లో పనిమనిషితో క్లోజ్‌గా ఉన్నప్పటికీ ఈ 5 విషయాలు తెలియనివ్వద్దు.. ఎందుకంటే?

by Kodari Anjali |   (  Updated:2025-02-03 09:31:20  IST  )

పనిమనిషి (maid) అంటే ఇంటి పనులు చేసే మనిషి.

maid: మీ ఇంట్లో పనిమనిషితో క్లోజ్‌గా ఉన్నప్పటికీ ఈ  5 విషయాలు తెలియనివ్వద్దు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: పనిమనిషి (maid) అంటే ఇంటి పనులు చేసే మనిషి. ఇంటి పనిమనిషిని ఇంగ్లీషులో 'మెయిడ్' (Maid) పిలుస్తుంటారు. పనిమనిషికి కూలిపని(Labour), నౌకరీ, సేవ అని పిలుస్తుంటారు. వీటితో పాటుగా పనిమనిషికి అనుచరుడు (follower), అనుచారకుడు, అనుసరుడు, దాసుడు (slave), నౌకరు, బంట్రోతు (Buntrotu), సేవకుడు (servant) అనే పదాలు కూడా వాడుతుంటారు.

ఒకప్పుడు కొంతమంది మాత్రమే పని మనుషుల్ని ఇంట్లో పనుల కోసం పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వం ఉద్యోగులు అంతా పనిమనిషిని పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో భార్యాభర్తలు (husband and wife) జాబ్ చేసే వారుంటే తప్పక పనిమనిషి ఉండాల్సిందే. ఇక కొంతమంది ఇళ్లలో వారి పని వారే చేసుకుంటారు.

అయితే కామన్‌గా పనిమనిషి ఒక ఇంట్లో చాలా కాలం పాటు వర్క్ చేస్తుంటే.. యజమానుల(owners)కు దగ్గరైపోతుంది. ఇంట్లో మనుషుల్లాగే కలిసిపోతుంది. యజమానులు కూడా పనిమనిషిని తమ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేస్తారు. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. వారు తినే ఫుడ్ పనిమనుషులకు పెడుతారు. అయితే నిజానికి ఇలా ఉండటం మంచిదే కానీ.. పలుమార్లు ఈ పద్ధతి చాలా ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పనిమనుషులు ఎంత క్లోజ్ గా ఉన్న కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. ఏఏ విషయాలు పంచుకోవద్దో ఇప్పుడు తెలుసుకుందాం.. లాకర్ (Locker) అండ్ ఖజానా (Treasury) గురించి పని మనిషి దగ్గర మాట్లాడొద్దు. ముఖ్యంగా ఆభరణాలు (Jewellery), మనీ గురించి చర్చించవద్దు. మిస్టేక్‌లో కూడా వారి ముందు లాక్ ఎక్కడుందో చెప్పవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే పిల్లల గురించి పనిమనుషులకు ఎక్కువగా తెలియనివ్వద్దు. కొంతమంది హౌస్ హెల్పర్స్ పిల్లల్ని (children) టార్గెట్ చేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తారు. ఏటైనా వెళ్లినప్పుడు కూడా కరెక్ట్ ఈ తేదీల్లో వెళ్తున్నామని, వస్తున్నామని తెలియనివ్వకపోవడం బెటర్.

ల్యాప్‌టాప్(Laptop), మీ ఫోన్ (Phone), కంప్యూటర్ (computer)ఇంటర్నెట్ వైఫై (internet wifi) వంటి పరికరాల డిటైయిల్స్ ఎల్లప్పుడు వారితో చెప్పొద్దు. అలాగే మీ ఖర్చులను పంచుకోవద్దు. ముఖ్యంగా క్లాస్ట్లీ క్లాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఇంటికొచ్చినాక పనిమనుషుల ముందు చర్చలు పెట్టవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story