- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి బొగ్గు బావులపై ఏ గద్దనూ వాలనివ్వ.. డిప్యూటీ సీఎం భట్టి మాస్ వార్నింగ్
సింగరేణి టెండర్లపై తాము విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణి టెండర్లపై తాము విచారణకు సిద్ధమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి టెండర్లపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి సిద్ధమని, 2014 నుంచి నిర్వహించిన టెండర్లపై విచారణ చేయిద్దామని హరీశ్ రావుకు సవాల్ విసిరారు. టెండర్లపై సమగ్ర విచారణ కావాలంటే హరీశ్ రావు తనకే నేరుగా లేఖ రాయవచ్చని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే విచారణ కోరుతామని స్పష్టం చేశారు.
చేసేదంతా మీ వాళ్లే.. మాపై లేఖలా హరీశ్..!
దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలోనూ డీజిల్ సప్లై చేసే పరిస్థితి లేదని, కానీ, 2022 నైనీ బ్లాక్ టెండర్లలో డీజిల్ విధానాన్ని మార్చారని ఆరోపించారు. సింగరేణిలో 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ హయాంలో, 5 తమ ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. సోదా కన్‌స్ట్రక్షన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డిది అని తెలిపారు. ఆ కంపెనీ ఎండీ ఆయన కూతురు దీప్తి రెడ్డి అని పేర్కొన్నారు. ఇందులో అంతా హరీశ్ రావు పార్టీకి చెందిన వాళ్లే ఉంటే, మాపై లేఖలు రాయడం ఏంటని భట్టి ప్రశ్నించారు.
సింగరేణి బొగ్గు బావులపై ఏ గద్దనూ వాలనివ్వను..
వాస్తవాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా ఏది పడితే అది రాస్తే సాగదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించుకునేందుకు రాలేదని, సమాజంలో మార్పు కోసమే వచ్చానని అన్నారు. తాను చేపట్టిన పాదయాత్ర సమయంలో కూడా సింగరేణి కోసం పోరాడానని గుర్తు చేశారు. సింగరేణిపై ఏ గద్దనూ వాలనివ్వనని.. బొగ్గు బావులు తెలంగాణకు ఎంత అవసరమో తనకు తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.






