- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Vs Bhatti: ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను ఎందుకు రద్దు చేశారు? భట్టికి హరీశ్ రావు కౌంటర్
సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని చెప్పకుండా 'బీటింగ్ అరౌండ్ ద బుష్' లా ఏదో చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మసిబూసి మారేడు కాయ చేశారమి మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మీరెన్ని సాకులు చెప్పినా మీ కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం. అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ మెన్ గా పాత్ర పోషించింది నిజం అన్నారు. ఇవాళ మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. 'భట్టి విక్రమార్కను నేను సూటిగా అడుగుతున్నా.. ఏ స్కాం జరగకుంటే నైనీ టెండర్లను (Naini coal block tenders) రద్దు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటించారు? నిన్న నేను బయటపెట్టిన మరో కుంభకోణం.. సోలార్ పవర్ స్కాం గురించి ఎందుకు ఒక్క మాట కూడా నేటి ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు? నైనీని రద్దు చేసినట్లే మిగతా అన్ని టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదు?' అని ప్రశ్నించారు.
మా మీదకు నెట్టితే నిజాలు అబద్ధాలు అయిపోవు:
సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవు, జరిగిన స్కాంలు, స్కీంలుగా మారిపోవని హరీశ్ రావు అన్నారు. సైట్ విజిట్ నిబంధనను 2018లోనే మొదలైందని చెప్పి, దానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉదాహరణలుగా చెప్పి ఏం చెప్పదలుచుకున్నారు? అది తప్పు కాకుంటే నైనీ ఎందుకు రద్దు చేసినట్లు? అని నిలదీశారు. ఇదే సైట్ విజిట్ విధానం సింగరేణిలో కూడా అమలు చేశామని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అన్నారు. సైట్ విజిట్ అమలయ్యింది, నైనీ రద్దు జరిగింది అంటే.. స్కాం జరిగినట్లే కదా? అని ప్రశ్నించారు. 'భట్టి విక్రమార్క గారు.. మీరంటే నాకు చాలా గౌరవం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై విచారణ జరగాలంటే సిట్టింగ్ జడ్జీ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సీబీఐ మాత్రమే చేయగలవు అన్న ఉద్దేశ్యంతోనే లేఖ రాశాను. మీరు నిజంగా రేవంత్ రెడ్డి, అతని బావమరిది కుంభకోణం మీద నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తాను అని హామీ ఇస్తే మీకూ లేఖ రాయడానికి సిద్దం' అన్నారు.






