- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులతో రాజకీయాలు చేయొద్దు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
రైతులతో రాజకీయాలు చేయొద్దని, ఈ దేశానికి రైతులే వెన్నెముకని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు.

దిశ, మహబూబాబాద్ టౌన్: రైతులతో రాజకీయాలు చేయొద్దని, ఈ దేశానికి రైతులే వెన్నెముకని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రెండు రోజుల శిక్షణ శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 20 సంవత్సరాల నుంచి రోడ్లు గుంతలు గా మారిపోయాయి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఒక కింటాకు 10 కిలోల వడ్లు గోల్మాల్ చేసి రైతులను ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల గోడు ఎవరూ పట్టించుకునే దాఖలు లేవని అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిదన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుంది. తప్ప ఏ ఒక్క హామీ చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మానుకోటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. మానుకోటకు ఆధునిక రైల్వే స్టేషన్, రాష్ట్రానికి వందేమాతరం ట్రైన్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. లార్డ్ యాక్టివేషన్, గ్రిడ్ బెల్ట్ చేశామన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, శ్యామ్ శర్మ, తదితరులు ఉన్నారు






