- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌తో యుద్ధం వేళ డ్రాగన్ దేశానికి డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 14న చైనా పర్యటనకు వెళ్లనున్నారు. జిన్‌పింగ్‌తో జరపనున్న ఈ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌తో అమెరికా యుద్ధం వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనా పర్యటనకు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రంప్ ఈ నెల 14, 15 తేదీల్లో చైనాలో పర్యటించనున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)తో ట్రంప్ నిర్వహించనున్న ఈ శిఖరాగ్ర సమావేశం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న కీలక అంశాలతో పాటు, అంతర్జాతీయంగా శాంతి భద్రతల స్థాపనపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
2025 అక్టోబర్‌లో దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా కలుసుకున్న ఈ ఇద్దరు నేతలు, సుమారు ఆరు నెలల విరామం తర్వాత మళ్లీ ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో, ఈ పర్యటన అంతర్జాతీయ మార్కెట్ల పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఇరాన్ విషయంలో చైనా సహకారాన్ని కోరడం- ఒక మధ్యవర్తిత్వ పరిష్కారాన్ని కనుగొనడమే ట్రంప్ ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పాటు డ్రాగన్ కంట్రీ లో ట్రంప్ పర్యటన ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.






