మెడ, భుజం నొప్పి‌.. గుండెపోటుకు కారణమవుతుందా..?

by Dishafeatures2 |
మెడ, భుజం నొప్పి‌.. గుండెపోటుకు కారణమవుతుందా..?
X

దిశ, ఫీచర్స్ : భుజాలతో పాటు మెడలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారా? ఈ పెయిన్‌ను తరచుగా అనుభవిస్తున్నారా? భుజం నొప్పే కదా త్వరలో తగ్గిపోతుందని భావించి విస్మరిస్తున్నారా? ఇంత చిన్న విషయానికి డాక్టర్‌ దగ్గరికి పరుగెత్తడం అవసరమా అని లైట్ తీసుకుంటున్నారా? కానీ ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు వైద్య నిపుణులు. ఈ పెయిన్స్ ఎందుకొస్తాయి? ఈ ప్రాంతాల్లో నొప్పిని కలిగించే పరిస్థితులు ఏమిటి? అనే అంశాలతో పాటు నివారణకు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో నిపుణులు అందిస్తున్న టిప్స్ మీ కోసం..

అతిగా శ్రమించడం, ఒత్తిడి వంటి కారణాలతో పాటు పరుపులు, దిండ్లు, పడుకునే భంగిమలు, బరువైన బ్యాగుల్ని భుజానికి వేసుకోవడం కూడా మెడ, భుజం నొప్పి వస్తుంటాయి. అయితే ఇవి ఒకటి రెండు రోజుల్లో తాగితే పర్వాలేదు కానీ నొప్పి ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం వైద్యుడిని తప్పక సంప్రదించాలి. చేతుల్లో తిమ్మిరి లేదా బలం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అజాగ్రత్త చేయొద్దని, నొప్పి ఛాతీపైకి వెళ్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే గుండెపోటు లేదా స్ట్రోక్‌కు సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. చాలా అరుదైన సందర్భాల్లో పిత్తాశయ రాళ్లు లేదా క్యాన్సర్ వంటి కారణాల వల్ల కూడా నొప్పి కలుగుతుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా కుడి భుజంలో నొప్పి పిత్తాశయ రాళ్లకు సంకేతం కాగా తరచుగా మెడకు ఒక వైపున పెయిన్ వస్తే, పడుకునే సమయంలో బ్యాడ్ పొజిషన్ కారణంగా లేదా బెణుకులు, గతంలో కలిగిన గాయాల వల్ల సంభవించే అవకాశముంది.

జీవనశైలిలో మార్పులు

భుజం నొప్పి నివారణలో లైఫ్ స్టైల్‌లో మార్పులు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పండ్లు, కూరగాయలు, గింజలు, చేపల వంటి యాంటీ ఇన్‌ఫ్లే‌మేటరీ ఆహారాలు స్వీకరించాలి. సిట్టింగ్ పొజిషన్స్, పడుకునే భంగిమలపై శ్రద్ధ వహించాలి. ఇక నొప్పి సమయంలో ప్రజలు తరచుగా సెల్ఫ్ మెడిసిన్స్ తీసుకోకుండా వైద్యుడి సలహా ప్రకారం మెడికేషన్ ఉత్తమం.

టిప్స్ :

* రోజంతా కూర్చుని పనిచేస్తుంటే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి చుట్టూ నడవాలి.

* ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుంటే హెడ్‌సెట్ ఉపయోగించాలి.

* వెన్నుపై బరువు పడకుండా, వెన్నుపూసకు మద్దతిచ్చే కుర్చీలో కూర్చోవాలి.


Next Story

Most Viewed