KGF 2లో 'ఇనాయత్ ఖలీల్‌'గా నటించింది ఎవరో తెలుసా?

by Dishanational2 |
KGF 2లో ఇనాయత్ ఖలీల్‌గా నటించింది ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : KGF చాప్టర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, సంజయ్ దత్ వంటి పలువురు ప్రముఖులు నటించారు. అయితే ఈ సినిమాలో ఓ ప్రముఖ తెలుగు నటుడి తండ్రి ఓ ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.





హ్యాప్పీడేస్, అరవింద సమేత వంటి చిత్రాలే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి, బాలకృష్ణ నీలకంఠపురం కేజీఎఫ్2లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఇనాయత్ ఖలీల్ ఒక కీలక పాత్ర. ఇందులో బాలకృష్ణ నీలకంఠపురం నటించారు. రాకీ చేతిలో నుంచి కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించే మాఫియా డాన్‌లలో ఇతను ఒకడు. బాలకృష్ణ ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా నటించాడు. అయితే ఆదర్శ్‌తో ఇనాయత్ ఖలీల్‌కి ఉన్న బంధం గురించి చాలా మందికి తెలియదు.

ఇక ఆదర్శ్ తన తండ్రి గురించి ట్వీట్ చేస్తూ.. మా నాన్నను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. కేజీఎఫ్ 2లో ఇనాయత్ ఖలీల్‌గా అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 65 ఏళ్ల వయసులో తన కెరీర్‌ను ప్రారంభించినందుకు చాలా హ్యప్పీగా ఫీలవుతున్నా.. మా నాన్నను నమ్మి తనకు ఆ పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ధన్యవాదాలు.. ఈ క్రెడిట్ మొత్తం మీదే అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Next Story

Most Viewed