- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liver Health: తరచూ పారాసెటమాల్ వాడుతున్నారా.. లివర్ హెల్త్‌పై ప్రభావం చూపనుందా?
సాధారణంగా జ్వరం (fever) కోసం ఉపయోగించే మందులలో పారాసెటమాల్ (Paracetamol)ఒకటి.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా జ్వరం (fever) కోసం ఉపయోగించే మందులలో పారాసెటమాల్ (Paracetamol)ఒకటి. దీనిని ఎసిటమినోఫెన్(Acetaminophen) అని పిలుస్తుంటారు. తేలికపాటి నుంచి మితమైన నొప్పికి చికిత్స చేయడంలో జ్వరాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే జ్వరం వచ్చినప్పుడల్లా వేసుకునే ఈ చిన్న టాబ్లెట్ లివర్(Liver Health) ను డ్యామేజ్ చేస్తుందా? అని చాలా మందిలో సందేహాలు తలెత్తే ఉంటాయి. కాగా తాజాగా నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.
లివర్ మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి. ఇది ఉదరంలో ఉదరవితానానికి (డయాఫ్రమ) కింద కుడివైపున మధ్యలో ఉంటుంది. కాలేయము పైత్యరసాన్ని తయారుచేస్తుంది. అది పిత్తాశయం(gall bladder)లో నిలువచేయబడి జీర్ణక్రియ(digestion)లో చాలా తోడ్పడుతుంది.అయితే చాలా మంది అతిగా ఆల్కహాల్ సేవిస్తే.. లివర్ పాడైపోతుందని అంటుంటారు. కానీ కేవలం మద్యమే కాదు.. మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ లివర్ ను దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాస్త తలనొప్పి(headache) వచ్చినా.. నడుము నొప్పి (back pain) వచ్చినా వెంటనే వైద్యుడ్ని అడగకుండానే చాలా మంది పారాసిటమాల్ వేసుకుంటారు. అలాగే ఈ టాబ్లెట్ వేసుకున్నాక చాలా మంది వాటర్ ఎక్కువగా తాగరు. దీంతో కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ (Dehydration) వల్ల లివర్ బాడీలోని విషపదార్థాల్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది. దీంతో కాలేయం ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఎక్కువ అని.. ఎప్పుడైనా సరే వైద్యుల సలహాల మేరకే టాబ్లెట్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






