తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. ఏఏ సమస్యలు తలెత్తుతాయంటే..?

by Kodari Anjali |

చాలా మంది తెలియకో లేదా ఏదో పని మీద బయటకెళ్లాలనో తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు.

తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా.. ఏఏ సమస్యలు తలెత్తుతాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది తెలియకో లేదా ఏదో పని మీద బయటకెళ్లాలనో తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. ఎప్పుడైనా సరే స్నానం (bath) చేశాక తినాలని సూచిస్తుంటారు. కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా.. తిన్న తర్వాత కూడా స్నానం చేస్తారు. మరీ తినడానికి, స్నానం చేయడానికి సంబంధం ఏంటి? దీనిపై ఎలాంటి వివరణ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

హెల్తీగా ఉండాలంటే.. అలాగే శాస్త్రం(science) ప్రకారం.. స్నానం చేసిన వెంటనే భోజనం చేయాలని నిపుణులు చెబుతుంటారు. కానీ ఫుడ్ తిన్న తర్వాత స్నానం చేస్తే నష్టాలే తప్ప లాభాలేం లేవంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు (Digestive problems) వస్తాయని అంటున్నారు. తిన్నాక బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. కాగా జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది. తిన్నాక చలి వాటర్‌తో స్నానం చేసినా నష్టాలేనని నిపుణులు సూచిస్తున్నారు.

 మీ శరీర ఉష్ణోగ్రత (body temperature) తగ్గుతుందని.. తద్వారా రక్త నాళాలు (Blood vessels) కుంచించుకుపోతాయని పేర్కొంటున్నారు నిపుణులు. ఇక జీర్ణ అవయవాలకు (Digestive organs) రక్త ప్రవాహం ఉండదని.. ఇది కాస్త జీర్ణ సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని వెల్లడిస్తున్నారు. కాగా ఎప్పుడైనా సరే స్నానం చేశాకే తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే తిన్న తర్వాత ఒక గంట, రెండు గంటల గ్యాప్ తర్వాత చేయాలని అంటున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story