- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mood swings: తరచూ మూడ్ స్వింగ్స్ మారుతున్నాయా.. ఎమోషన్స్ అదుపులో ఉండాలంటే..?
మూడ్ స్వింగ్స్ (mood swings)అంటే ఆకస్మిక మార్పులు. మెదడు రసాయనాల స్థాయి మారడం వల్ల ఇవి సంభవిస్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: మూడ్ స్వింగ్స్ (mood swings)అంటే ఆకస్మిక మార్పులు. మెదడు రసాయనాల స్థాయి మారడం వల్ల ఇవి సంభవిస్తాయి. మనం ఏ సిచ్యూవేషన్‌ను ఎంజాయ్ చేయాలన్నా.. మంచి మూడ్ ఉండాలి. మూడ్ బాగుంటూనే ఏ పని అయినా చేయగలం. కొంతమందికి సడెన్‌గా అప్పటికప్పుడే మూడ్ ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఫలితంగా ఈవెంట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంటుంది. అయితే మూడ్ మారుతుండటానికి కొన్ని కారణాలున్నాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు.
అయితే సాధారణంగా మూడ్ మారడం అనేది టీనేజర్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఇది పెద్దలతో కూడా కనిపిస్తుంటుంది. అయితే మూడ్ స్వింగ్స్ ఎందుకు కలుగుతున్నాయో అర్థ చేసుకుని ప్రవర్తన ఛేంజ్ చేసుకోగలిగితే ప్రాబ్లమ్ తొందరగా సాల్వ్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అమ్మాయిలకు పీరియడ్స్ సమయంలో కూడా మూడ్ స్వింగ్స్ మారుతుంటాయి.. చికాకు, ఒత్తిడి, విచారం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కాగా వీటికి చెక్ పెట్టాలంటే కంటికి సరిపడా నిద్ర, హెల్తీ ఫుడ్, రెస్ట్ తీసుకోవాలని.. ఈ టెక్నిక్ పాటిస్తే మేలని నిపుణులు వెల్లడిస్తున్నారు.
మీ మూడ్ స్వింగ్స్ మారడానికి వాతావరణం కూడా కారణం కావొచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్ లేదా సీజనల్ మార్పులు, హార్మోనల్ మార్పులు వంటివి ఏవైనా మీ మూడ్ ను ఛేంజ్ చేస్తుండవచ్చు. మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలంటే.. దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఉఛ్ఛ్వాస, నిశ్వాసలపై మనస్సు కేంద్రీకరిస్తే కాస్త ప్రశాంతత దొరుకుతుంది.
అలాగే చూపు, ధ్వని, వాసన వంటి అంశాలపై ఫోకస్ పెడితే మిగిలిన థాట్స్ అన్నింటిని డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది. వీటితో పాటుగా మ్యూజిక్ వినండి, చదవడం, వినడం, ప్రకృతిలో కొద్దిసేపు నడవడం, ఆర్ట్ వర్క్ వంటి పజిల్స్ కూడా ట్రై చేయండి. దీంతో మీ మూడ్ స్థిరంగా ఉంటుంది. అలాగే ఒక పేపర్ మీద మీ ఆలోచనలు రాసుకోండి. సన్నిహితుల నుంచి సలహా, సూచనలు అడగండని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.






