ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దు

by Disha Web Desk 12 |
ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవద్దు
X

దిశ,చౌటుప్పల్: ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనంచేసుకోవద్దంటూ.. రైతులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన పలువురు రైతులు గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..గ్రామంలోని సర్వే నెంబర్ 252 లో అసైన్డ్ భూమిని ఎస్సీ, ఎస్టీ రైతులకు కేటాయించడం జరిగిందని దీంతో తాము బోర్లు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా సాగు తీసుకుంటున్నామని తెలిపారు.

కానీ మళ్లీ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో తమకు కేటాయించిన భూములను సర్వే చేసి తిరిగి తీసుకుంటుందని.. ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేయొద్దని రైతులు వాపోయారు. తమ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోకుండా చూడాలంటూ జిల్లా అడిషనల్ కలెక్టర్‌ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పింటి యాదయ్య, మస్కు నర్సింహ, పిట్టల లచ్చుమయ్య, పులిగిల్ల రాములు, పిట్టల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed