TVK కు కాంగ్రెస్ మద్దతు! 'వెన్నుపోటుదారు' అంటూ DMK ఫైర్

by Muthe.Rajitha |

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ భారీ సీట్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

TVK కు కాంగ్రెస్ మద్దతు! వెన్నుపోటుదారు అంటూ DMK ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో TVK పార్టీ భారీ సీట్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పార్టీకి 108 సీట్ల బలం ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 సంఖ్యా బలం ఉండాలి. అయితే విజయ్ రెండు చోట్లా గెలవడంతో మరో స్థానం తగ్గి TVK కు 107 సీట్లు మిగులుతాయి. మరి మెజారిటీ బలాన్ని ఎలా సాధిస్తుంది అనేదే ఇపుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఎన్నికల్లో స్టాలిన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రచారం చేసారు కాబట్టి ఆ పార్టీ మద్దతు కోరే అవకాశం లేదు. మరోవైపు తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని విజయ్ ముందుగానే ప్రకటించిన ప్రకారం.. AIDMK, BJP కూటమితో కూడా జట్టు కట్టే అవకాశం లేదు. అయితే ఇక్కడ విజయ్ INDIA కూటమి మద్దతు కోరే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు కోరినట్టు తెలుస్తుండగా.. హస్తం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అయితే కాంగ్రెస్ కు 5 సీట్లే ఉండగా.. మిగిలిన సీట్ల కోసం డీఎంకే కూటమిలోని IUML, CPI, CPM, VCK కు రెండు సీట్లు చొప్పున, DMDK దగ్గర ఒక సీటుంది కాబట్టి విజయ్‌ వారి మద్దతూ కోరవచ్చు. కూటమి కట్టుబాట్లను దాటి సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలు విజయ్‌కు మద్దతిస్తారా అనేది వేచి చూడాలి. అయితే INDIA అలియన్స్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. కాంగ్రెస్ విజయ్ కి మద్దతు తెలుపుతున్నట్టు వస్తున్న వార్తలపై డీఎంకే మండిపడుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నేత శరవణన్ అన్నాదురై చేసిన "వెన్నుపోటుదారు" పోస్టు సంచలనంగా మారింది. తమతో పొత్తు పెట్టుకొని, ఇపుడు ప్లేటు ఫిరాయించడంపై ఆ పార్టీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అయితే నిజంగానే టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా లేదా అనేది రేపు తెలియనుంది. మరోవైపు టీవీకే అధినేత విజయ్ రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Next Story