- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 3న Dk శివకుమార్ ప్రమాణ స్వీకారం!
జూన్ 3న కర్నాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతుండటం దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కర్నాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడిన సంగతి తెలిసిందే. అధిష్టానం సూచనతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య శుక్రవారం సాయంత్రం రాజీనామా చేయగా.. జూన్ 3న ఆ రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతుండటం దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకార వేదికగా 'లోక్ భవన్ గ్లాస్ హౌస్' లేదా చారిత్రాత్మక 'విధాన సౌధ' గ్రాండ్ స్టెప్స్ ను ఎంపిక చేసే పనిలో ఉంది యంత్రాంగం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ శ్రేణులు భారీగా తరలిరానున్నాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలు, రాష్ట్ర పరిపాలనను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం కర్నాటకలో ఎలాంటి రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.






