- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Students: చదివేటప్పుడు డిస్టర్బ్ అవుతుందా.. విద్యార్థులు పాటించాల్సిన బెస్ట్ టిప్స్ ఇవే?
విద్యార్థులు చదువేటప్పుడు ప్రశాంతంగా ఉంటేనే తొందరగా చదవడం కంప్లీట్ అవుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు(students) చదువేటప్పుడు ప్రశాంతంగా ఉంటేనే తొందరగా చదవడం కంప్లీట్ అవుతుంది. అలాగే ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఉండటమే కాకుండా చదివింది చక్కగా గుర్తుంటుంది. అయితే చదివేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తలెత్తకుండా ఉండాలంటే ఈ బెస్ట్ టిప్స్ పాటించాలని అంటున్నారు నిపుణులు. చదివేటప్పుడు ప్రతీ 25 నిమిషాల తర్వాతకొకసారి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విరామం తీసుకోవడం వల్ల చదువుపై ఇంకాస్త ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే కష్టమైన సెలబస్ ముందుగా కంప్లీట్ చేస్తే చదవడంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మేలు. ఆ ప్రాణాళికను ఒక పేపర్ పై రాసుకుని గోడకు అతికించాలి.
అలాగే చదువుపై శ్రద్ధ అనేది చదివే ప్రదేశంపై కూడా డిపెండ్ అయి ఉంటుంది. చదివేటప్పుడు మంచి ప్లేస్ ఎంపిక చేసుకోవాలి. అలాగే స్టూడెంట్స్ సాధారణంగా ఎగ్జామ్స్ అంటే ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. తద్వారా చదివింది కూడా మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. కాగా ఇలాంటి టైంలో ఆందోళన తగ్గించుకోవడం మేలు. ఈ క్రమంలో మెడిటేషన్ అండ్ డీప్ బ్రీతింగ్ వంటివి చేయడం ముఖ్యం. అలాగే విద్యార్థులు రోజూ శారీరకంగా కూడా వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒత్తిడి తగ్గకపోవడమే కాదు.. డే మొత్తం యాక్టివ్ గా ఉంటారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






