- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెరిగిన ధరలు.. సిలిండర్‌కు దండ.. చెప్పుకు దండం పెట్టి..
by Manoj |
దిశ, హనంకొండ చౌరస్తా : పెంచిన నిత్యావసర ధరలను నిరసిస్తూ కాంగ్రెస్..latest telugu news

X
దిశ, హనంకొండ చౌరస్తా : పెంచిన నిత్యావసర ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ హన్మకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు బంక సరళ సోమవారం గోకుల్ నగర్ జంక్షన్ వద్ద గ్యాస్ సిలిండర్‌కు పూలదండ వేసి చెప్పులకు దండం పెడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కరెంట్, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్,పప్పు, ఉప్పు నూనె, నిత్యావసర వస్తువుల ధరను పెంచి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలవాల్సిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా.. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
Next Story






