- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు అసెంబ్లీ రద్దు
తమిళనాడు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేసారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో, 16వ శాసనసభ రద్దు మే 5వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని గవర్నర్ ప్రకటించారు. మే 4న విడుదలైన ఫలితాల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజారిటీ (118 సీట్లు) లభించకపోవడంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఈ క్రమంలో పాత అసెంబ్లీని రద్దు చేసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు గవర్నర్ శ్రీకారం చుట్టారు. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్య విజయాన్ని నమోదు చేసి, 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికార డీఎంకే (DMK) కేవలం 59 సీట్లకే పరిమితం కాగా, ఏఐఏడీఎంకే (AIADMK) 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది.
మెజారిటీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు నేడు గవర్నర్ నుంచి పిలుపు వచ్చినప్పటికీ.. మెజార్టీ బలం లేకపోవడం వల్ల విజయ్ వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రేపు జరగాల్సిన ప్రమాణస్వీకారం కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు, ఇతర చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో టీవీకే బృందం నిమగ్నమై ఉండగా.. AIDMK బీజేపీతో జట్టు కట్టడం ఇష్టం లేని ఆ పార్టీ నేతలు.. విజయ్ పార్టీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.






