భారత్‌లో ‘X’ సేవల్లో అంతరాయం.. వెల్లువెత్తిన నెటిజన్ల ఫిర్యాదులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-16 16:20:35  IST  )

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘X’ (ట్విట్టర్) శుక్రవారం రాత్రి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.

భారత్‌లో ‘X’ సేవల్లో అంతరాయం.. వెల్లువెత్తిన నెటిజన్ల ఫిర్యాదులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘X’ (ట్విట్టర్) శుక్రవారం రాత్రి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. భారత్ (India) సహా అమెరికా (America), బ్రిటన్ (Britain) వంటి పలు దేశాల్లో వేలాది మంది వినియోగదారులు తమ అకౌంట్లను యాక్సెస్ చేయలేకపోయారు. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌ డిటెక్టర్’ (Down Detector) ప్రకారం, రాత్రి 8.30 తర్వాత సమస్యలు మొదలయ్యాయి. దాదాపు 56 శాతం మంది యాప్‌తో ఇబ్బంది పడగా.. 33 శాతం మంది వెబ్‌సైట్ పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. గత నాలుగు రోజుల్లో ఇలా జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే, ‘X’ సరైన అంతరాయానికి గల ఖచ్చితమైన కారణాన్ని సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, సర్వర్ లోపాల కారణంగానే ఇలా జరిగి ఉండవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం సేవలు క్రమంగా పునరుద్ధరించబడుతున్నాయి.

Next Story