తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

by Disha Web Desk 2 |
తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి
X

దిశ, చింతలమానేపల్లి: అసెంబ్లీ ముట్టడికి సిద్ధమవుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను పక్కా సమాచారంతో చింతలమానెపల్లి ఎస్ఐ విజయ్ అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మాట్లాడుతూ... 4779 జీఓను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల నుంచి పనిచేస్తున్న 7651 ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించారని వాపోయారు. ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క ఉద్యోగాల ప్రకటన చేస్తూ.. మరో పక్క ఉద్యోగులను తొలగించడం కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్చరించారు. ఇప్పటికే ఉద్యోగాలు వస్తాయో, రావో తెలియక సుమారు 70 మంది ఫీల్ అసిస్టెంట్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్లలో చౌదరి శ్రీనివాస్, శ్యమల్, జాడి శంకర్, సంతోష్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed