- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతను రీప్లేస్ చేసిన బాలీవుడ్ భామ.. ఆ సినిమా కోసమే..??
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.. Latest Telugu News..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. 'పుష్ప' మూవీలో 'ఊ అంటావా మావా' అందరినీ కట్టిపడేసింది. అంతేగాకుండా 'శాకుంతలం, యశోధ' సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపించనుంది. వాటితో పాటుగా మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో కీలక పాత్రల్లో మురిపించేందుకు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఓ సినిమాలో అమ్మడి పాత్రని బాలీవుడ్ భామ కొట్టేసిందట. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్.
'పుష్ప-2'లో ఉండనున్న స్పెషల్ సాంగ్‌లో సమంత కాకుండా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ చేయనుందట. 'పుష్ప 2'లో స్పెషల్ సాంగ్‌కు సమంతను కాకుండా దిశాపటానిని మేకర్స్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోసేందుకు దిశాపటాని ఓకే చెప్పేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఏమాత్రం నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.






