- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ.. ఎఫెక్ట్ .. : బియ్యం అక్రమ రవాణాను సహించం
రేషన్ సన్నబియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీఎస్‌ఓ మల్లికార్జున్ బాబు స్పష్టం చేశారు.

దిశ, వైరా : పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సన్నబియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఖమ్మం ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ) మల్లికార్జున్ బాబు స్పష్టం చేశారు. రేషన్ బియ్యం అక్రమ కొనుగోలు, రవాణాకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం సాయంత్రం దిశ వెబ్‌సైట్‌లో, మంగళవారం దిశ దినపత్రికలో ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతున్న అంశంపై "తెలంగాణ టు ఆంధ్ర" శీర్షికతో ప్రచురితమైన కథనంపై స్పందించిన డీఎస్‌ఓ మంగళవారం ఉదయం ఖమ్మంలోని తన కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్ డీటీలు, ఆర్‌ఐలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఆర్‌ఐల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్లికార్జున్ బాబు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. అదేవిధంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న వ్యాపారుల కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, బియ్యం నిల్వ చేస్తున్నట్లు అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్ డీటీలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.






