- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. రంగంలోకి దిగిన ఆర్టీఏ అధికారులు
జిల్లా కేంద్రంలో మంగళవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

దిశ,కొత్తగూడెం: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ అంశంపై, ఇతర రాష్ట్రాల స్క్రాప్ వాహనాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నడుపుతున్నారని అంశంపై ‘దిశ’ దిన పత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో స్కూల్ బస్సులను ఆపి వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇతర అనుమతులను పరిశీలించారు.
తనిఖీల సందర్భంగా డ్రైవర్ల వద్ద ఉన్న పత్రాలను అధికారులు పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలపై అప్రమత్తం చేశారు. ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపై నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎంవీఐ మనోహర్ హెచ్చరించారు . విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్ యాజమాన్యాలు తప్పనిసరిగా వాహనాల ఫిట్‌నెస్, బీమా, అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.






