- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంధన ఎగుమతులపై డ్యూటీ పెంపు.. నేటి నుంచే అమల్లోకి!
పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా - ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందంతో స్వస్తి పలికిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా - ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందంతో స్వస్తి పలికిన విషయం తెలిసిందే. జూన్ 19న స్విట్జర్లాండ్ లో శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అయినప్పటికీ ఇంధన సంక్షోభం మళ్లీ తీవ్రం కాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై అదనపు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన కొత్త పన్నురేట్లు నేటి నుంచీ అమల్లోకి రానున్నాయి. తాజా సవరణల ప్రకారం.. డీజిల్ ఎగుమతులపై లీటరుకు ఉన్న పన్ను రూ.13.05 పైసల నుంచి రూ.14కు పెంచింది. ఏటీఎఫ్ ఎగుమతులపై ఉన్న డ్యూటీని లీటరుకు రూ.9.05 పైసల నుంచి రూ.12.05 పైసలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఎగుమతులపై ఎక్స్ పోర్ట్ డ్యూటీని రూ.1.05 పైసలుగానే కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
దేశంలో రోజువారీ అవసరాలకు వాడే పెట్రోల్, డీజిల్ లపై ఉన్న డ్యూటీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం విదేశాలకు ఎగుమతి చేసే ఇంధనంపైనే పెంచిన డ్యూటీలు అమలవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా దేశీయ మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, విదేశాలకు ఇంధన ఎగుమతులను నియంత్రించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 27 నుండి పెట్రోలియం ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న భౌగోళిక రాజకీయ సవాళ్లు, పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఇంధన నిల్వలకు ఎటువంటి కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ అదనపు పటిష్ట చర్యలు చేపట్టింది.






