- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుక్కల దాడిలో కొండగొర్రె మృతి.. పరిశీలిస్తున్న ఫారెస్ట్ అధికారులు
by Jakkula.Mamatha |
దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

X
దిశ,దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండడంతో దాహార్తి తీర్చుకునేందుకు గ్రామ శివారుకు వచ్చిన ఓ కొండగొర్రెపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన కొండగొర్రె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం వచ్చిన ఈ అడవి జంతువు కుక్కల బారిన పడిందని తెలిపారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా అడవి జంతువులు గ్రామాల వైపు వస్తుండటంతో వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
Next Story






